నెల్లూరు నగరంలోని స్థానిక కస్తూరి దేవి గార్డెన్స్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆత్మీయ అభినందన సభ ప్రగణంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ రాష్ట్రపతి అవార్డు వార్డు గ్రహీత చుక్కల పార్థసారథిని వెంకయ్య నాయుడు గారు అభినందిస్తూ విశ్వవిద్యాలయాలు దినదిన అభివృద్ధి చెందుతున్న అన్నారు భవిష్యత్తులో తన వంతు ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన పార్ధు చదువుతోపాటు ప్రజలకు విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ ద్వారా సేవలను అందించడం సంతోషదాయకం అని అన్నారు. విద్యార్థులు తనను పూర్తిగా తీసుకొని చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని తెలిపారు.