పోలీసులు ఎంతకట్టడి చేస్తున్నా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు కేటుగాళ్ళు. తాజాగా లేబర్ కమిషనర్ ను అంటూ వసూళ్లకు పాల్పడిన ఓ వక్యిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా చిరు వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ దొరక్కుండా అధికారులకు చుక్కలు చూపెడుతున్నాడు. దీంతో అతని టార్చర్ తట్టుకోలేక బాధితులు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫోన్ చేసినా.. బెదరకుండా తాను లేబర్ కమిషనర్ నంటూ ఓవర్ యాక్షన్ చేసాడు మోసగాడు. అనుమానం వచ్చిన ఎమ్మెల్యే నల్గొండ టూ టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి నిందితుడిని అరెస్ట్ చేసారు. కడప జిల్లా బీకుడూరు చెందిన వ్యక్తిగా గుర్తింపు.