కారంపూడి మండలం లోని చిన్నగార్లపాడు గ్రామంలో అప్పుల బాధతో కౌలు రైతు వేంపాటి శ్రీనివాసరెడ్డి (35) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు చినగార్లపాడు గ్రామ శివారు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లే డొంకదారిలో శ్రీనివాసరెడ్డి నవక్రాన్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు శుక్ర లేదా శనివారం ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలుస్తుంది వర్షాలు పడుతుండడంతో రైతులు పొలాల వైపు వెళ్లకపోవడంతో ఘటనను గుర్తించలేదు సోమవారం పొలాలకు వెళ్లిన రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు వెంటనే కారంపూడి ఎస్సై రామాంజనేయులు సోమవారం సాయంత్రం ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు ఇది ఇలా ఉంటే శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం చిన్నగార్లపాడు ఇక్కడ వ్యవసాయంలో అప్పులు కావడంతో ఉన్న పొలం అమ్మి అప్పులు తీర్చాడు ఆ తర్వాత పదేళ్ల క్రితం చిన్నగార్లపాడు గ్రామం నుంచి వారి అమ్మమ్మగారి ఊరు తాడికొండ మండలం పోనేకల్లుకు వల్ల వెళ్ళాడు అక్కడ పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు అక్కడ కూడా ఆరు లక్షల దాకా అప్పులు అయ్యాడని అక్కడ అప్పుల బాధ తట్టుకోలేక శుక్రవారం ఊరికి వెళ్తానని ఇంట్లో చెప్పి చినగార్లపాడు డొంక దగ్గరకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది మృతుడు శ్రీనివాస్ రెడ్డికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయి ఎనిమిదవ తరగతి అబ్బాయి ఆరో తరగతి చదువుతున్నారు ఈ ఘటనతో చిన్నగార్లపాడు గ్రామం లో విషాదం అలుముకుంది ఈ విషయంపై ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి సోమవారం రాత్రి మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు తరలించారు.