సిద్దిపేటజిల్లా బెజ్జంకి మండలంలోని ఆదివారం కురిసిన భారీ వర్షనీకి వడ్ల కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో 20 రోజుల క్రితం పోసిన వడ్లను మ్యాచర్ రావడం లేదని ,కాలయాపన చేస్తూ ,ఇప్పటి వరకు తూకం (కాంఠ) వేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతు కష్టాలు పట్టించుకోకుండా పార్టి ప్లినరిలు చేసుకోవడానికి ఉన్న సమయం, రైతు గోస పట్టించుకొనే సమయం రాష్ట్ర ప్రభుత్వనికి లేదన్నారు. వెంటనే ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ,మొలకెత్తిన దాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో మనకొండూర్ యూత్ కాంగ్రస్ ఉపాధ్యక్షుడు శనాగొండ శ్రవణ్ కుమార్,మనకొండూర్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ దొనే వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.