మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలంలోని కిష్టంపేట రైతుల వినూత్న నిరసన తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి పోస్టుకాలు రాసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజవర్గం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ద్వారా ఉద్యమం చేపట్టారు గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేసి తీరాలని లేఖలో రైతులు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు
- వరి ధాన్యానికి ఇస్తానన్న బోనస్ రూ. 500
- రైతు భరోసా రూపాయలు10 వేల బదులు .రూ.15 వేలు ఇవ్వాలి
- రైతు కూలీలకు ఇస్తానన్న .రూ.12 వేలు చెల్లించాలి
- రైతు రుణమాఫీ రూ.2 లక్షలు మాఫీ చేయాలి
- వీటితోపాటు రైతు బీమా వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా రూ.25 వేలు చెల్లించాలి
- ఈ లేఖలో సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కాళ్ల ద్వారా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు