- సాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలి
- నీరు లేక ఎండిపోతున్న పంటలు చూసి కన్నీరు మున్నీరవుతున్న రైతులు
కృష్ణా జిల్లా : విస్సన్నపేట మండలం పుట్యాల గ్రామంలో NSP లెఫ్ట్ కెనాల్ మూడో జోన్ పరిధిలోని రేపూడి ఫస్ట్ సెకండ్ మేజర్ల లకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని కోరుతూ తిరువూరు ఆర్డీవో ప్రసన్న లక్ష్మిని కలిసిన వినతి పత్రం ఇచ్చిన రైతులు
పుట్యాల గ్రామంలో NSP లెఫ్ట్ కెనాల్ కింద రేపూడి ఫస్ట్ సెకండ్ మేజర్లు ఉన్నాయని లెఫ్ట్ కెనాల్ కి 2022 నవంబర్ 15 నుండి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా ఈ మేజర్లు కు నీళ్లు రావటం రైతులు వాపోయారు
ఈ మేజర్ల కింద పంటలు వేసిన రైతులు నీళ్లు రాక ఎండిపోయిన పంటను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు
బోర్లా ద్వారా పంటను సాగు చేస్తున్నామని ఎండలు ఎక్కువ అవుతంతో పంటకు సరిపడా నీరు లేకపోవటంతో చేతికొచ్చే పంటలు ఎండిపోతున్నాయని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు
స్పందించవలసిన NSP A.E,D.E లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వారిలో చలనం లేదని వేసిన పంట ఎండిపోవటంతో తాము బతకడం కష్టమని రైతులు మాట్లాడారు
ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే రేపూడి ఒకటి, రెండు మేజ ర్ల లకు నీళ్లు విడుదల చేయాలని లేకపోతే ఈ మేజర్ల కింద పంటలు వేసిన రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని రైతులు వాపోయారు
పుట్రాల గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి, వెంకటేశ్వరరావు, రాజశేఖర్ రెడ్డి ,రంగారెడ్డి, మోహన్ రావు, దొడ్డ వెంకటేశ్వర్లు శేషయ్య ,తదితరులు ఆర్డీవో ప్రసన్న లక్ష్మీ ని కలిసి వారి గోడును తెలిపారు