ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ (ఎఫ్ ఎఫ్ సి ఐ) క్రైస్తవ సంస్థ ప్రకాశం జిల్లా యూత్ అధ్యక్షులుగా కల్వరి ప్రసన్నత మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ రెవ.డాక్టర్ కోడి జగన్ పాల్ ని ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు పీటర్ పుట్ట నియమించారు. నియామాక పత్రాన్ని తీసుకున్న బిషప్ రెవ.డాక్టర్ కోడి జగన్ పాల్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, మందిరాలపై జరుగుతున్న దాడులు, సువార్తికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, పరిష్కరిస్తూ క్రైస్తవుల హక్కులు మరియు పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న క్రైస్తవ సంస్థ ఎఫ్ ఎఫ్ సి ఐ. క్రైస్తవులపై దాడులు జరిగితే సహించేదేలేదని ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం కూడా జరుగుతున్న దాడులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ మహత్తరమైన బాధ్యతను అప్పగించిన సంస్థ నాయకులు, వ్యవస్థాపకులు పీటర్ పుట్ట గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.