contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

MiG-29 Fighter Jet Crashes : ఆగ్రాలో కూలిన మిగ్-29 జెట్ విమానం

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) సమీపంలో మిగ్-29 (MiG-29) యుద్ధ విమానం సోమవారంనాడు కుప్పకూలింది. అయితే విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. వైమానిక విన్యాసాల కోసం ఫైటర్ జెట్ పంజాబ్‌లోని అదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం కుప్పకూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

విమానం కుప్పకూలడానికి కొద్ది ముందే పైలెట్ల్ ఇద్దరూ విమానం నుంచి దూకేయడంతో సురక్షితంగా బయటపడినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కగారోల్‌ లోని సోనిగ గ్రామం సమీపంలోని పొలాల మధ్యలో ఫైటర్ జెట్ కూలగడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విమానం నేలకు తాగగానే ముక్కచెక్కలైందని, మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయని స్థానికులు తెలిపారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :