కరీంనగర్ జిల్లా : చొప్పదండి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో మృతి చెందిన హోంగార్డు ఇప్పారపు సదయ్య కుటుంబానికి మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు ఆర్థిక సహాయం అందజేశారు. గత ఏప్రిల్ 29న సైదాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు ఇప్పారపు సదయ్య (45) మృతి చెందిన విషయం విదితమే. మంగళవారం నాడు పోలీస్ కమిషనర్ మృతి చెందిన హోంగార్డు భార్య జయ, కూతుర్లు వైష్ణవి, స్నేహిత లకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసిపి కరుణాకర్ రావు, చొప్పదండి సిఐ రవీందర్, ఎస్సై ఉపేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.
