కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోఈరోజు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుభాష్ నగర్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పూరిళ్లు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈరోజు ఉదయం పూరిళ్ల నుంచి మంటలు చెలరేగాయి. అయిదు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. పూరిళ్లలో నివసించేవారు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
