ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఈ ఎక్స్ ప్రెస్ యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాకున్నా.. షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా రైల్లో మంటలు చెలరేగాయి.
ఆరు బోగీలకు మంటలు అంటుకోగా… నాలుగు బోగీలు పూర్తిగా తగలబడిపోయాయి. తొలుత పొగలు వచ్చిన వెంటనే ప్రయాణికులు రైలు చైన్ లాగి కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంలో ప్రయాణికులు ఎవరికీ ప్రమాదం జరగలేదు.
ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ హుటాహుటిన ప్రమాద స్థలికి బయల్దేరారు.