ప్రకాశం జిల్లా, చీమకుర్తి : విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు చీమకుర్తి సూర్య గ్రానైట్స్ వారు ముందుకు వచ్చారు. పది క్వింటాళ్ల పులిహోర, పదివేల తాగు నీరు బాటిళ్లను సిద్ధం చేసి ప్రత్యేక వాహనంలో తరలించారు. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వరద ప్రభావం తగ్గేవరకు మరింత ఆహరం పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
