మంచిర్యాల జిల్లా…చెన్నూరు: నియోజకవర్గంలోని శివారం సోమనపల్లి మధ్య ఉన్న ముసళ్ళ అభరణ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి ట్రైన్ లో ఉన్న బీట్ ఆఫీసర్స్ సందర్శించడం జరిగింది. వారికి చెన్నూరు డివిజన్ అధికారి ఎస్ రమేష్ కే శివ కుమార్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో శిక్షణ ఆఫీసర్ బాలకృష్ణ శివారం రిజర్వ్ ఫారెస్ట్ ముసళ్ళ అభయ అరణ్యం వాడే ప్రాముఖ్యత గురించి వివరించారు. అదేవిధంగా ఎల్మడుగులో ఉన్న మోసాలు వారికి చూపెడుతూ స్కావెంజర్లుగా పనిచేస్తూ జంతుకళేబరాలను చనిపోయిన చేపలను తింటూ నీటి కాలుష్యాన్ని లేకుండా చేస్తున్నాయని, అంతేకాకుండా నీటి పిల్లలు అడవిలో ఉన్న రకరకాల చెట్లు, పురాతన గుహలు, గుట్టల పైన పూర్వీకులు నిర్మించిన గుళ్ళు, ఎల్మడుగులో బోటింగ్, ట్రేకింగ్ ,ఏకో టూరిజం లో భాగంగా ఏర్పాటుచేసిన శివారం అభయారణ్యం విశిష్టతలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది మరియు ట్రైని అధికారులు పాల్గొన్నారు.