మంచిరియల్ జిల్లా : నెన్నెల మండలకేంద్రంలో గురువారం జిల్లా అటవీశాఖ అధ్వర్యంలో నీ తునికాకు సేకరణ, నికర ఆదాయ చెక్కుల పంపిణీ కార్యక్రమం కు నిర్వహించారు, ముఖ్య అదితులుగా తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ, న్యాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య , డి సిసి బి చైర్మన్ భోజారెడ్డి,
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతు ఒక్క బెల్లంపల్లి నియోజక వర్గంలోనే తునికాకు సేకరణ బోనస్ చెక్కులు మొదటి విడతగా 10,87,49,288 రూపాయల బోనస్ చెక్కులు మంజూరైనవి అని రాష్ట్ర అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అన్నారు.
నెన్నల మండలం లోని 29 మందికు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులు రూపాయిలు 29,03,364 లబ్ధిదారులకు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణమాఫీ 2,63,27,000 రూపాయల విలువగల చెక్కులను మహిళా సంఘాలకు రాష్ట్ర అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందచేశారు.
ఈ కార్యక్రమంలోచెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్,జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ,మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా,బి బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్,బి జెడ్పీటీసీ లు శ్యామల-రాంచందర్, బానయ్యా, సత్యనారాయణ, ఎంపీపీ లు రమాదేవి-ప్రతాప్ ప్రణయ్, బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అశోక్ గౌడ్ , వేమనపల్లి మండల అధ్యక్షులు వేణుమాధవ్ రావు, నియోజకవర్గ యువజన అధ్యక్షులు మహేష్ గౌడ్,ఉపాధ్యక్షులు ఉదయ్,రవితేజ గౌడ్,సన్నీ యాదవ్, బిఅర్ఎస్వి అధ్యక్షులు అన్వర్,పట్టణ యువజన అధ్యక్షులు సన్నీ,ఉపాధ్యక్షులు శ్రీనాథ్ , బిఅర్ఎస్వి పట్టణ అధ్యక్షులు శ్రావణ్,యువ నాయకులు యసిన్,కొట్టే వినయ్ ,మోగురం వినయ్,కిషోర్,కొట్టే రాకేష్, ప్రజాప్రతినిధులు,సంబంధిత అధికారులు, బి అర్ ఎస్, బిఅర్ఎస్,వై, బిఅర్ఎస్వి నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.