కరీంనగర్ జిల్లా: హైదరాబాద్ నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డా,కే. లక్ష్మణ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో మానకొండూర్ నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బిజెపి పార్టీలో చేరారు. వీరికి కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
