నాంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిరోజ్ ఖాన్‌పై కేసు నమోదయింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటరుకు రూ.1 లక్ష ఆఫర్ చేశారంటూ సెక్షన్ 171సీ, 188, 123 ఆర్పీ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఐదు గంటల లోపు వరుసలో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. రేపు పోలింగ్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, ఐటీ కంపెనీలు ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఆదేశించారు.