contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీలో నాలుగు క్రికెట్ ఆకాడెమీలు – కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ !

  • ఏపీలో నాలుగు క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
  • ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై సమీక్ష చేశారు.

రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుకు వచ్చిందని, కడప, తిరుపతి, మంగళగిరి, విశాఖపట్నంలలో క్రికెట్‌ అకాడమీల ఏర్పాటు దిశగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ”ఆడుదాం ఆంధ్ర” పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలపై తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుకు వచ్చిందని, అంటూ సిఎస్కే సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.. ఈ సందర్భంగా అధికారులు.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పోటీల నిర్వహణపై వివరాలను సీఎం జగన్‌కు అందించారు.

క్రమంలో ఈ ఆటలను అత్యంత ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ క్రీడా సంబరాలు ఉపయోగపడాలని పేర్కొన్నారు. ”చక్కటి స్ఫూర్తిని నింపేలా ఆటల పోటీలు సాగాలి. పోటీలకు వచ్చే క్రీడాకారులకు మంచి భోజనం సహా ఇతర సదుపాయాలు అందేలా చూడాలి. పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారులు అంతా ఈ పోటీల్లో భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు.

రాష్ట్రంలో క్రికెట్‌ సహా ఇతర క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్‌ స్టేడియం దిశగా అడగులు వేయాలి. ఇది సాకారం అయ్యాక ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న వైయస్సార్‌ స్టేడియంను.. క్రీడలకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దేదిశగా ముందడుగులు వేయాలి. ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలి” అని అన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుండి మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని గత సమీక్షలో సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఇందుకు గాను గ్రామ, మండల స్థాయిల్లో అనువైన క్రీడా ప్రాంగణాలు, మైదానాలను గుర్తించి వాటిని వివిధ క్రీడల నిర్వహణకు వీలుగా అన్ని విధాలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అంతే గాక ఈ క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు వీలుగా గ్రామ స్థాయి నుండి యువత పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యే విధంగా ప్రోత్సాహించాలని సూచించారు. గ్రామ స్థాయిలో యువజన సంఘాలను భాగస్వాములను చేసే విధంగా అదికారులు ప్రత్యేక చొరవ చూపించాలని సూచించారు. అవసరం అయితే జిల్లా స్దాయిలో ఉన్న అదికారులు గ్రామాల్లో పర్యటించి క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను వివరించి అవగాహనా కార్యక్రమాలను రూపొందించాలని పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :