ఇప్పటివరకు మనం చూసింది .. మనకి తెలిసింది .. ఆధార్ నంబర్ బాంక్ అకౌంటు కి లింకు చేయండి లేదా మీ అకౌంటు మూతపడుతుంది అంటూ ఫ్రాడ్ కాల్స్ లేదా ఫ్రాడ్ మెసేజెస్ వచ్చేవి, అటువంటి ఫోన్ కాల్స్ కి గాని మెసేజులకు స్పందిస్తే మీ అకౌంటు లో నుండి డబ్బు పోయేది. బ్యాంక్ ఎలాంటి ఆధార్ నంబర్ కానీ పాన్ కార్డు నంబర్ కానీ ఆడగదు ఒకవేళ ఎవరైనా ఇలా అడిగితే స్పందిచకూడదని చాలా మంది బ్యాంక్ ఖాతాదారులకు అవగాహవన వచ్చింది.
ఇప్పుడు కొత్తగా మరో కొత్త రకం మోసానికి తెర లేపారు మోసగాళ్ళు :-
మీ గూగుల్ పే కి గాని , ఫోన్ పే కి కానీ ఒక వంద రూపాయలు మోసగాడు పంపిస్తాడు. వెంటనే మీకు ఫోన్ చేసే పొరపాటున వేరే వాళ్ళకి పంపాల్సిన డబ్బు పొరపాటున మీకు పంపించాను కాబట్టి నా వంద రూపాయలు తిరిగి నాకు పంపించండి అంటూ అడుగుతాడు. దాంతో వంద రూపాయలే కదా అని మీరు తిరిగి పంపిస్తారు . ఇక అంతే సంగతి .. మీ మొబైల్ పేమెంట్ అప్లికేషన్ నుండి మీ ఖాతాలో ఉన్న డబ్బు మోసాగాడి అకౌంటు లోకి వెళ్ళిపోతుంది . కాబట్టి ఇలా ఎవరన్నా మీ అకౌంటు లోకి 50/- కానీ 100/- కానీ పంపి తిరిగి ఇవ్వమని కోరితే మౌనంగా ఉండండి . అంతే కానీ 50 రూపాయలే కదా అని తిరిగి పంపించకండి.
మొబైల్ వినియోగ దారులు గత మూడు నెలల కాలంలో ఇప్పటి వరకు కోట్ల రూపాయలు మోసపోయారు. మోసగాళ్ళు కొత్తరకం మాల్ వేర్, ఫిషింగ్ వేర్ లని వాడుతూ మొబైల్ పేమెంట్ గేట్ వే ని బై పాస్ చేస్తూ మీ డబ్బుని కొల్లగొడుతున్నారు.
మొబైల్ పేమెంట్ యాప్ లలో ఎలాంటి లోపాలు లేవు అవి సురక్షితంగా ఉన్నాయని సమాచారం. అలాగే మీ మొబైల్ ఫోన్ లో యాంటీ వైరస్, యాంటీ మాల్ వేర్ ఉన్నా అవి ఇలాంటి మోసాలని పసిగట్టలేవు. మోసగాళ్ళు కావాలనే మీ ఫోన్ నంబర్ కి కొంత డబ్బుని అంటే 50 కానీ 100 రూపాయాలని కానీ పంపిస్తారు, తరువాత మీకు ఫోన్ చేసి తన డబ్బుని తిరిగి పంపించమని అడుగుతారు కానీ ఇలాంటి సందర్భాలలో మీరు చేయాల్సింది ఏమిటంటే మీకు డబ్బు పంపిన వారిని మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వస్తే అక్కడ మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని చెప్పండి. దాంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రారు మీరు సురక్షితం. ఇది కేవలం మీకు తెలియని వాళ్ళు డబ్బు పంపించిన సందర్భానికి మాత్రమే వర్తిస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి.
మరో ముఖ్య విషయం ఏమిటంటే చాలా మంది ఎవరికన్నా డబ్బు పంపిస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నారు ఇది ప్రమాదకరం అని పవన్ దుగ్గల్ హెచ్చరిస్తున్నారు ! మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తికి స్క్రీన్ షాట్ పంపిస్తే ఫరవాలేదు కానీ అపరిచితులకి ఇలా స్క్రీన్ షాట్ పంపడం ప్రమాదకరం !
ప్రజలకు అవగాహన కోసమే కొంత సమాచారాన్ని సేకరించి పాఠకుల కొరకు పబ్లిష్ చేసాము. సైబర్ క్రైమ్ పై మరింత సమాచారాన్ని ఇవ్వగలిగిన వారు తప్పక మాకు పంపినట్లైతే .. ప్రచురిస్తామని తెలియజేస్తున్నాము.