కరీంనగర్ జిల్లా గన్నేరువరం: ఓ విలేఖరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను శనివారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బోయిని పోచయ్య ఆధ్వర్యంలో దహనం చేశారు. ఎమ్మెల్సీ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ముదిరాజుల సంఘం సభ్యులు భారీగా ర్యాలీ చేపట్టి శవయాత్రతో నిరసన వ్యక్తం చేశారు. దిష్టిబొమ్మను చెప్పులతో దాడి చేశారు.
