మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చిందని ఇందుకు ప్రభుత్వం చేయూత
ఇవ్వాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం
ఆయన శాసనసభలో మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకర్గంలో 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం
లేదన్నారు. తనకు సేవ చేయడానికి ఒక అవకాశం
వచ్చిందన్నారు. పదేళ్లుగా ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యమని చెప్పారు.బి ఆర్ ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి అందరికీ తెలుసు ఆన్నారు. ఈ ప్రాంతంలోసరైన సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలనీ కోరారు. నియోజకవర్గంలో ాగునీటికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అడ
ప్రాజెక్టు నుంచి ఇచ్చే తాగునీటి వల్ల ప్రజలకు అవస్థలు తప్పడం లేదన్నారు.
ఎల్లంపల్లి నుంచి మందమర్రి, బెల్లంపల్లి పట్టణాలకు గతంలో రాజశేఖర్ రెడ్డి
హయాంలో వేసిన పైపులైన్లకు నిధులు ఇచ్చి పునరుద్ధరించాలని కోరారు. బెల్లంపల్లి పట్టణంలో మురుగు కాలువలు, రహదారులు అధ్వానంగా ఉన్నాయన్నారు.
మున్సిపాలిటిలో నిధుల కొరత ఉంది. వేమనపల్లి, నెన్నెల మండలాలు పూర్తిగా
వెనుకబడి ఉన్నాయన్నారు. బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో 20 మంది
సిబ్బంది మాత్రమే ఉన్నారని పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.