జోగుళాoబ గద్వాల్ జిల్లా: భావి తరాలకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జీవితం ఆదర్శప్రాయమని, ఆయనను ప్రపంచ మే గొప్ప మేధావి గుర్తించిందని, దేశానికి ఆయన చేసిన సేవలను దేశ ప్రజలు స్పూర్తిగా తీసుకోవాలని ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 67 వ వర్ధంతి సందర్భంగా జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి, గద్వాల్ పట్టణం లోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.