విశాఖపట్నం : గాజువాక గుడివాడ అప్పన్న కాలనీలో వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ (విసిసి) మరియు ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా పర్యావరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ లక్ష్మణ స్వామి మరియు బొడ్డు అప్పారావు విచ్చేసారు.
గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ స్వామి మాట్లాడుతూ, “గాంధీజీ ఆశయాలను పాటించడం ఎంతో ముఖ్యమైనది. ఆయన అనుసరించిన అహింసా మార్గం, సమాజంలో శాంతి మరియు సమానత్వాన్ని తీసుకువచ్చే మార్గం” అని అన్నారు.
విసిసి గాజువాక జోన్ కన్వీనర్ మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు బగాది సాయి, సిహెచ్ బాలాజీ, యు ఆర్ ఎల్ స్వామి ఇతర నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గాంధీ సేవలను స్మరించారు.
ఈ వేడుకలు, యువతలో గాంధీ ఆలోచనలను ప్రాచుర్యం చెయ్యడంలో కీలకపాత్ర పోషించాయి.