కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి చెందిన డా. అన్నాడి శ్రీనివాసరెడ్డి. గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విధులు నిర్వహిస్తున్నాడు . డాక్టర్ అన్నాడీ శ్రీనివాస్ రెడ్డి తండ్రిగారైన అన్నాడి ముత్యంరెడ్డి జ్ఞాపకార్థం.. సుమారు 100 వంద మందికి పైగా విద్యార్థులకు టై,బెల్టులు అందజేశారు. ఈ సందర్భంగా అతను టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ నేను పూర్వం ప్రాథమిక విద్యను ఇదే ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశానని అన్నాడు. తనకు బాల్యంలో అక్షర ఓనమాలు దిద్ది ఉన్నత స్థాయికి చేర్చిన పాఠశాల విద్యార్థులకు సామగ్రి అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, అన్నింటిలోనూ రాణిస్తున్నారని గుర్తు చేశారు. విద్యార్థులు క్రమ శిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని అన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అందజేయాలని , వారి శిష్యుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మహేష్ యాదవ్ ,జీల కుమార్ యాదవ్,గడ్డం మహిపాల్ రెడ్డి , మల్లేష్ యాదవ్ లకు సూచించాడు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, స్వామి,మల్లేశం పాల్గొన్నారు.