కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల ప్రభాకర్ ఆధ్వర్యంలో
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, మార్కెట్ డైరెక్టర్ జాలి లింగారెడ్డి, చాకలివాని పల్లె గ్రామ శాఖ అధ్యక్షులు బోయిని బాలయ్య, మైలారం గ్రామ శాఖ అధ్యక్షులు నూకాల తిరుపతి, మల్లారెడ్డి, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ పాలెపు అజయ్, నాయకులు ఈదయ్య, బొడ్డు శీను, జవాజి శ్రీనివాస్,పాలేపు కొమరయ్య, జవాజి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో గంప వెంకన్న జన్మదిన వేడుకలు
లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 వారు నిర్వహిస్తున్న మిల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా లయన్ గంప వెంకన్న లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం జన్మదిన సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని సివిల్ ఆస్పత్రి ఆవరణంలో మాతా శిశు హాస్పిటల్ నందు దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్ గంప వెంకన్న, డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ మంద వెంకట రమణారెడ్డి, జెడ్ సి మిల్స్ ఆన్ విల్స్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ లయన్ రావికంటి కృష్ణ కిషోర్ పాల్గొన్నారు.
శ్రీ మానసా దేవిని దర్శించుకున్న గంప వెంకన్న
గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట శ్రీ స్వయంభు మానస దేవి ఆలయంలో గంప వెంకన్న జన్మదినం సందర్భంగా గంప వెంకన్న సతీమణి మల్లేశ్వరి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,
గంప వెంకన్న పుట్టినరోజు సందర్భంగా యువకులు పలు సేవా కార్యక్రమాలు
ఖాసీంపేట బస్టాండ్ యూత్ మరియు గంప వెంకన్న యువసేన యూత్ ఆధ్వర్యంలో గంప వెంకన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువకులు పెద్ద ఎత్తున భారీ కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు, గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు,
కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న గంప వెంకన్న
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న మరియు సతీమణి మాజీ సర్పంచ్ గంప మల్లేశ్వరి తో కలిసి జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్న స్వామి గుట్టపై వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.