జాతిపిత మహాత్మా గాంధీ వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్లో ఉన్న గాంధీ విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి , ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , జిల్లా కలెక్టర్ ఏ.తమిమ్ అన్సారీయా పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యాగ్రహమే ఆయుధంగా, అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వతంత్రాన్ని అందించిన జాతిపిత యొక్క గొప్పతనాన్ని విశిష్టతను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వారితోపాటు అయినా బత్తిన ఘనశ్యామ్, తాతా ప్రసాదు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
అనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోని మునిసిపల్ కార్యాలయం లో ఒంగోలు నగర పాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన ఉత్తమ పారిశుధ్య కార్మిక పురస్కారాలు కార్యక్రమం లో పాల్గొని పరిశుద్ధ కార్మికులకు దుస్తులు మరియు పి. పి. ఇ. కిట్ల పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లోవారితోపాటు నగర మేయర్ గంగాఢ సుజాత , కమిషనర్ కె. వెంకటేశ్వర రావు మరియు కార్పొరేటర్లు, అధికారులు , నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.