కరీంనగర్ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రం గన్నేరువరంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మానకొండూర్ నియోజవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి వెళుతుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గులాబి రంగు షర్టు ధరించడం ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉందని ఆరోపిస్తూ రసమయి బాలకిషన్ తో వాగ్వాదం చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను పోలింగ్ కేంద్ర నుంచి బయటకు పంపించడంతో వివాదం సద్గుమనిగింది.