కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో, మాదాపూర్ గ్రామ రైతువేదిక మరియు గోపాల్ పూర్ గ్రామంలో ఆయిల్ పామ్ పంట సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట నాటిన 3 సంవత్సరాల తర్వాత దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగునని, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేయాలని, ఖచ్చితమైన మార్కెటింగ్ సౌకర్యం కలదని, అకాల వర్షాలు, వడగళ్ళ వానకు పంట దెబ్బతినదని తెలిపారు. ఉద్యాన అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ చట్టం ప్రకారం రైతు పండించిన ప్రతి గెలను కంపెనీ వారు కొనుగోలు చేస్తారని, రాయితీ పై మొక్కలు మరియు డ్రిప్ సదుపాయం ఏర్పాటు చేస్తామని, ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి 4200/- చొప్పున 4 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లించబడునని, కోతుల బెడద ఉండదని, మూడు సంవత్సరాల వరకు అంతరపంటలు వేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం మండలం లో 50 ఎకరాలలో సాగు అవుతుందని,ఒక ఎకరానికి సంవత్సరానికి లక్ష రూపాయల నికర ఆదాయం పొందవచ్చని ఆసక్తి గల రైతులు పట్టా పాసుబుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా జిరాక్స్, పాసుపోర్టు సైజు ఫోటో లతో వ్యవసాయ విస్తరణ అధికారి లేదా ఉద్యాన అధికారి కి అందజేయాలనీ సూచించారు. ఈకార్యక్రమంలో మాదాపూర్, గోపాల్ పూర్ గ్రామల సర్పంచులు,మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి ఉద్యాన అధికారి కందుకూరి స్వాతి,ఏఈఓ సౌమ్య, లోహియా కంపెనీ క్షేత్ర అధికారి ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.
