కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ : గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యం కోసం మధ్యాహ్న భోజనం తినేందుకు డైనింగ్ హాలును నిర్మించారు. అన్ని సౌకర్యాలతో టేబుల్లు, మంచినీటి కోసం నల్లాలు బిగించారు. పనులు పూర్తిచేసి రంగులు వేశారు. దాదాపు 250 మంది విద్యార్థులు గల పాఠశాలలో దీన్ని ప్రారంభిస్తే సౌకర్యంగా ఉంటుంది. వర్షాకాలం కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేది. కానీ పనులు పూర్తయిన ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తొందరగా ప్రారంభం చేసి విద్యార్థులకు ఉపయోగపడేల చూడాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.