కరీంనగర్ జిల్లా: గన్నేరువరం పోలీస్ స్టేషన్ అవరణలో ఎస్సై సిహెచ్ నరసింహారావు ఆధ్వర్యంలో యువతకు క్రీకెట్ క్రీడా సామాగ్రిని సిపి సుబ్బారాయుడు,ఏసీపి కరుణాకర్ రావు,సిఐ ఇంద్రసేనారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా గన్నేరువరం క్రికెట్ క్రీడాకారులు సిపి కి విగ్నేశ్వర స్వామి చిత్రపటం అందజేసి మొక్కను బహుకరించారు. గన్నేరువరం జట్టుకు క్రికెట్ కిట్ అందజేసినందుకు ఎస్సై సిహెచ్ నరసింహ రావు కి యువజన సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో వివిధ మండలాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.