కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామ శ్రీ మానసా దేవి ఆలయంలో శ్రీ చక్ర ప్రతిష్టాపన కార్యక్రమాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈనెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మొదటి రోజు గోపూజ,విగ్నేశ్వర పూజ శ్రీ చక్ర యంత్ర పూజలు ప్రతిష్టాపన దేవతా హోమాలు వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు మామిడాల నాగసాయి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు బద్దం చిన్న నరసింహారెడ్డి, ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, గౌరవ అతిధులు బద్దం తిరుపతిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.