కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల స్పెషల్ ఆఫీసర్ డి.సి.ఓ శ్రీ మాల మరియు మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను గురువారం పరిశీలించారు,చొక్కారావు పల్లి గ్రామంలో మొక్కజొన్న చేను వరి పొలాలు, వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. వరి కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించారు. చొక్కారావు పల్లి గ్రామ సర్పంచ్ తో మాట్లాడి కొనుగోలు కేంద్రానికి కావాల్సిన హమాలీలను మాట్లాడి కొనుగోలు త్వరగా పూర్తి చేయమని చెప్పారు. 33% కంటే ఎక్కువ పంట నష్టపోయిన రైతులకి ఎకరానికి 10,000/- చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుంది. కావున 33% కంటే ఎక్కువ పంట నష్టం జరిగిన రైతులు వాళ్ల విలేజ్ ఏఈఓ కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఏఈఓ వారి పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు సందర్శించి నష్టపోయిన పంట నమోదు చేసుకుంటారు అని తెలిపారు. తర్వాత గన్నేరువరం ఐకెపి సెంటర్ ని సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చొక్కారావుపల్లి సర్పంచ్ ముస్కు కర్ణాకర్ రెడ్డి, ఏఈఓ ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు.