కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 192 బూతులో ఈవీఎం మొరాయించింది. ఈవీఎం ను తిరిగి ప్రారంభించడానికి సుమారు 50 నిమిషాల సమయం పట్టింది. దీంతో క్యూ లైన్ లో ఉన్న కొంతమంది ఓటర్లు ఓటు వేయకుండా వెనక్కి వచ్చారు. ఈ బూతులో 992 మంది ఓటర్లు ఉన్నారు.