కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. మండల కేంద్రానికి చెందిన దేశరాజు కనకయ్య విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నూతన మండల అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ పాములుపర్తి వేణుగోపాల చారి నూతన అధ్యక్షుడు దేశరాజ్ కనకయ్య కు నియామక పత్రాన్ని అందజేసి శాలువతో సత్కరించారు, ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
