రీంనగర్ జిల్లా గన్నేరువరం మండల సర్వసభ్య సమావేశం శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు ఎంపీటీసీలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలోని విద్యుత్ సమస్యలతో పాటు నీటి సమస్యకు పరిష్కారం చూపాలని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడేల్లి ఆంజనేయులు అధికారులను కోరారు. జంగపల్లి గ్రామంలో వివిధ ఇండ్లపై ఉన్న లెవెన్ కె.వి విద్యుత్ లైన్ తొలగించాలని సర్పంచ్ అట్టికం శారద సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ఉపకాల్వల ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల కబ్జాపై సంబంధిత అధికారులు దృష్టి సారించి తక్షణమే హద్దులను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులు వచ్చే మూడు నెలల్లో ప్రతి గ్రామంలో యువత గంజాయి మత్తుకు బానిస కాకుండా అవగాహన సదస్సు నిర్వహించాలని తెలిపారు. దీనిపై గత సమావేశంలో తీర్మానం చేసిన నిర్లక్ష్యం చేశారన్నారు. అలాగే వివిధ గ్రామాల్లో నెలకొన్న నీటి సరఫరా పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ చైర్మన్ అల్వాల కోటి, డిప్యూటీ తాసిల్దార్ మహేష్ రావు, ఎంపీఓ పివి నరసింహారెడ్డి, ఎస్సై మామిడాల సురేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.