వినుకొండలో కొత్త తరహ మోసం
సిలిండర్ లో మాయం అవుతున్న 2 కేజీ ల గ్యాస్..
గ్రామంలో సరఫరా చేసిన అన్ని సిలిండర్ ల లో 2 కేజీ ల గ్యాస్ వ్యత్యాసం. .
వినుకొండ నియోజకవర్గంలో కొట్ట తరహా మోసం
వెలుగులో కి వచ్చింది. వినియోగదారులను బురిడి కొట్టించి దోచుకుంటున్న వైనం… నిత్యం మనం ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లో రెండు కేజీల గ్యాస్ మాయం అవుతున్న సంఘంటన తాజాగా వినుకొండ మండలం పెదకంచర్ల గ్రామంలో వెలుగు చూసింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ లో 14 కేజీలు ఉండాల్సిన సిలిండర్ లో రెండు kg లు మాయం అయ్యింది. అయితే పొరపాటున ఒక సిలిండర్ లో వచ్చింది అనుకుంటే పొరపాటు జరిగింది అనుకోవచ్చు కాని గ్రామంలో పంపిణి చేసిన అన్ని సిలిండర్ ల్లో కుడా 2 kg ల గ్యాస్ మాయం అవ్వటంతో అసలు బండారం బయటపడింది. ఆ రోజు గ్రామంలోకి వచ్చిన గ్యాస్ బండి ద్వారా సరఫరా అయిన సిలిండర్ లను అన్నింటిని గ్రామస్తులు ఒక చోటకి తీసుకు వచ్చి కాటా వేయగా అన్ని సిలిండర్లలో 2 kg ల గ్యాస్ వ్యత్యాసం బయటపడింది. అసలే గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇంటికి వచ్చిన గ్యాస్ సిలిండర్ లో 2 kg ల గ్యాస్ తగ్గటంతో వారు లబో దిబో అంటున్నారు. దీని పై అధికారులు విచారణ చేపట్టి, సామాన్య ప్రజలను మోసం చేస్తున్న గ్యాస్ కంపెని పై చర్యలు చేపట్టాలని గ్యాస్ వినియోగదారులు కోరుతున్నారు.