పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు ఐదేళ్ల కిందట డెలివరీ చేసిన వైద్యురాలు కత్తెర కడుపులోనే మర్చిపోయింది. సదరు మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ హైదరాబాదులోని ఓ హాస్పిటల్ లో స్కాన్ చేయించుకోగా కడుపులో కత్తెర ఉన్నట్టు తెలిసింది. బాధితురాలు గోదావరిఖని ఆసుపత్రికి వచ్చి వైద్యురాలి ని నిలదీయగా పొరపాటు జరిగిందని ఆసుపత్రి ఖర్చు అంతా నేనే భరిస్తానని. వైద్యురాలు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.