ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని రూరల్ సీఐ రామకోటయ్య, అర్బన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ముందుగా పోలీసు సిబ్బంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి రాచర్ల గేటు సెంటర్ లో మానవహారం నిర్వహించారు. పోలీసుల అమరవీరుల సంస్కృత దినోత్సవా ప్రత్యేకతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గిద్దలూరు సీఐలు సురేష్, రామకోటయ్య మాట్లాడుతూ… 1959లో భారత సైన్యం లడక్ లో చైనా సైన్యంతో పోరాడుతూ అమరలు అయ్యారని అన్నారు.
తక్కువ సైన్యం ఉన్నా కానీ భారత్ సైనికులు వెనకాడకుండా విరోచితంగా పోరాడి వారి ప్రాణాలు అర్పించారని అన్నారు. అందుకు గుర్తుగా అక్టోబర్ 21వ తేదీన పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని వారన్నారు. వారం రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రక్తదాన శిబిరాలు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు అనుగుణంగా పోలీసులు వారు విధులు నిర్వహిస్తారని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొని కూడా ప్రజల భద్రత గురించి ఆలోచిస్తారని సిఐలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.