ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వర్క్ షాప్ సదస్సులలో పాల్గొని, ఉపన్యసించడానికి గీతం, హైదరాబాద్ లోని ఆంగ్లం, ఇతర భాషల విభాగం అధిపతి డాక్టర్ సయంతన్ మండల్, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జోంధాలే రాహుల్ హీరామన్లు విదేశాలకు బయలుదేరి వెళ్లారు.
ఫ్రాన్స్లోని నాటింగ్హామ్ బ్రెంట్ యూనివర్శిటీ పోస్ట్కలోనియల్ అండ్ గ్లోబల్ స్టడీస్ రీసర్చ్ గ్రూప్, యూనివర్సిటీలోని పరిశోధనా కేంద్రం ఎమ్మె (ఈఎంఎంఏ) ఆధ్వర్యంలో జూన్ 27-28న నిర్వహించిన బంగ్లా, మరాఠీ దళిత పక్ష పత్రికల యొక్క ‘మెనీ లెనై అండ్ ఆఫ్టర్లెక్స్ట్’ అనే వర్క్షాస్లో ప్రసంగించడానికి డాక్టర్ సయంతన్ సుండల్, డాక్టర్ జోంధాలే రాహుల్ హిరామన్ లు ఆహ్వానం అందుకున్నారు. వారిద్దరూ 2022 నుంచి బంగ్లా, మరాఠీ దళిత పీరియాడికల్ప్ కొనసాగిస్తున్న పరిశోధనను యూకే-ఆధారిత పీహెచ్ స్కాలర్లకు పరిచయం చేయడం, పీరియాడియల్ సంస్కృతిపై సరిశోధన కొనసాగించేందుకు శిక్షణ ఇచ్చి, విద్యార్థులకు ఒక పద్ధతిని అలవరచడం ఈ వర్క్ షాప్ లక్ష్యం.
ఈ కార్యక్రమం తరువాత, యునైటెడ్ కింగ్డమలోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్లో జులై 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్న గ్లోబల్ బుక్ కలర్స్: మెటీరియలిటీస్, కొలాబరేషన్, యాక్సెస్ అనే పేరుతో సొసెట్రీ ఫర్ ది హిస్టరీ ఆఫ్ ఆథర్షిప్, రీడింగ్, అండ్ పబ్లిషింగ్ 2024 సదస్సులో డాక్టర్ సయంతన్, డాక్టర్ రాహుల్ ఉపన్యసిస్తున్నారు. వర్తమానంలో, గతంలో విశ్వవ్యాప్తంగా పుస్తకాలు, గ్రంథాలు ఎలా తయారు చేశారు. ఎలా వాటిని పంపిణీ చేశారు, ఔత్సాహికులు వాటిని ఎలా చదివారు అనే దానిపై ఈ సమావేశం దృష్టి సారిస్తోంది.
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ స్, హైదరాబాద్ అధ్యాపకులు డాక్టర్ సయంతన్, డాక్టర్ రాహుల్ ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమాలలో ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.