గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ 15వ పట్టాల ప్రదానోత్సవం (స్నాతకోత్సవం) ఈనెల 20న (శనివారం) శివాజీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించనున్నట్టు గీతం హెదరాబాద్ ప్రో వెస్ట్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ మహత్తరమైన రోజున వివిధ విభాగాలకు చెందిన దాదాపు 1800 మంది విద్యార్థులు పట్టాలను అందుకోనున్నట్టు ఆయన తెలిపారు. ఈ అభ్యర్థులు 2023-24 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సెన్ట్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్ కోర్సులను గీతం హెదరాబాద్ ప్రాంగణంలో విజయవంతంగా పూర్తిచేసి, డిగ్రీలు పొందేందుకు అర్హత సాధించినట్టు ప్రొవీసీ వివరించారు.
గీతం కులపతి డాక్టర్ నీరందర్ సింగ్ చౌహాన్ సర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఎం.శ్రీభరత్ తో పాటు ముఖ్య అతిథిగా బార్సేస్ బ్యాంక్ ఇండియా పూర్వ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) రామ్ గోపాల్ పాల్గొంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్లో అత్యాధునికంగా అభివృద్ధి చేసిన సదుపాయాలను రామ్ గోపాల్ ప్రారంభిస్తారని తెలియజేశారు. గీతం 15వ పట్టభద్రుల దినోత్సవానికి సంబంధించిన మరింత సమాచారం కోసం గీతం వెబ్ సెట్ www.gitam.edu ను సందర్శించాలని ప్రోవీసీ సూచించారు.