- గీతం ఆతిథ్య ఉపన్యాసంలో బార్క్ పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని
పరిశోధనలో జవాబుదారీతనం ఆవశ్యమని, పరిశ్రమ అవసరాలను అర్ధం చేసుకుని, ఆచరణాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని బాబా అణు పరిశోధనా సంస్థ పూర్వ శాస్త్రవేత్త, ముంబై_ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ కె.ఇందియా ప్రియదర్శిని సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సాంకేతిక శాస్త్రం అభివృద్ధికి ప్రాథమిక పరిశోధన: రసాయన / జీవ శాస్త్రాల సమన్వయంలో సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై మంగళవారం ఆమె అతిథ్య ఉపన్యాసం చేశారు.
రసాయన, జీవ శాస్త్ర రంగాలలో ప్రాథమిక పరిశోధన, సాంకేతిక అభివృద్ధిపై ఆమె విలువైన అంతర దృష్టిలను అందించడంతో పాటు కర్యుమిన్, సెలినియంలపై తన పరిశోధనా ఫలితాలను సదస్యులతో పంచుకున్నారు. పరిశోధ కులు సృజనాత్మకంగా యోచించాలని, ప్రాజెక్టులను ఇతరుల సహకారంతో చేపట్టాలని, వినూత్న ఆలోచనలను ప్రత్యక్ష ఉత్పత్తులుగా మార్చి, మేధో హక్కులను పొందడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆమె సూచించారు. ప్రశ్నలకు అడగమని ప్రోత్సహిస్తూ, వాటికి వివరణాత్మక జవాబులిచ్చారు..
తొలుత, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం అతిథిని సదస్యులకు పరిచయం చేసి, ఇతర సహోధ్యాసకులతో కలిసి సత్కరించారు. తరువాతి తరం పరిశోధకులను వినూత్నంగా ఆలోచించేలా, పనిలో శ్రేష్టత కోసం ప్రయత్నించేలా ప్రేరేపించేలా సాగిన ఈ ఆతిథ్య ఉపన్యాసంలో పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.