గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వివేకానంద. రాయకి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘ఇంటర్వెల్- వాల్యూడ్ వేరియేషనల్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ కు కొన్ని పరిష్కార విధానాలపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ కుమ్మరి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. వివేకానంద సిద్ధాంత వ్యాసం నిర్దిష్ట తరగతి నిరామం- విలువ గల వైవిధ్య సాక్షిక ప్రోగ్రామింగ్ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన వినూత్న పద్ధతులను అందిస్తుందన్నారు. రాయంకికి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మోతహర్ రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.