ప్రకాశం జిల్లా, గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో ముస్లింల ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కి ప్రత్యేకంగా సారే సమర్పించారు. కుల మతాలకతీతంగా సమాజం లో అందరూ సమానత్వంగా సౌబ్రాతృత్వంగా సోదర భావజాలంతో మెలగాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సాంప్రదాయాన్ని భావితరాలకు చాటడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టుగా సున్ని జమయత్ అంజుమన్ కమిటి అధ్యక్షులు దూదేకుల హజరత్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు తాలూకా ప్రభుత్వ చీఫ్ ఖాజీ షేక్ నాయబ్ రసుల్, కొండపేట గ్రామానికి చెందిన జమాల్ ఖాద్రీ, నరవ బయినపల్లి గ్రామానికి చెందిన కౌలూరి కాసిం ఖాద్రీ, కొండపేట గ్రామానికి చెందిన షేక్ ఖాసిం వలి ఖాద్రి, మరియు గిద్దలూరు పట్టణానికి చెందిన నాయబ్ ఖాజా ఖాద్రి, నబీ రాజా, పటాన్ షుకుర్ ఖాన్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.