- ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరివరప్రసాద్
ఏపీలో గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతుందని జాతీయ ఎస్టీ కమిషన్ సెక్రెటరీ శ్రీమతి అల్కా తీవారి ఢిల్లీ లోని జాతీయ ఎస్టీ కమిషన్ కార్యాలయం నందు ఎస్సీ ఎస్టీ కమీషన్ మాజీ సభ్యులు డా. శ్రీ కొండారెడ్డి నరహరి వరప్రసాద్ పలు సమస్యలపై చర్చించారు.
ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్న అరాచకపు చర్యలు మరియు గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేసి ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదోవ పట్టించే నవ రత్నాలకు మళ్ళించే కార్యక్రమాలనుజరుగుతున్నాయని, మైదాన ప్రాంత గిరిజనుల రాజకీయ రిజర్వేషన్లు, వైసీపీ ప్రభుత్వం గిరిజనులపై సాగిస్తున్న అరాచకాలు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్క దోవ పట్టించి గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసే సంక్షేమ పథకాలు రద్దు చేసారని, గిరిజనులకు నియోజక వర్గాలు వారీగా ఎమ్మెల్యే , ఎంపీ టికెట్లను కేటాయించి వారి హక్కులకు రక్షణ కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సెక్రెటరీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తామని అక్కడి మైదాన ప్రాంత గిరిజన ప్రాంతాలను సందర్సిస్తామని ఖచ్చితంగా మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం లో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.