- సుప్రీం కోర్టులో జీఓ నంబర్ 3 పై రివ్వూ పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉండగా అధికారులు మైదాన ప్రాంత ఉపాధ్యాయలను ఏజేన్సీ లో బదిలీ చెయ్యడాని గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది
- నూరు శాతం రిజర్వేషన్లు అమలు కై చట్టం చేయాలి.
- టి. ఏ సి లో నూరు శాతం రిజర్వేషన్లు పై తీర్మానం చేసిన గిరిజన ఎంఎల్ఏ లు సమాదానం చెప్పాలి
అల్లూరి జిల్లా, అరకువాలీ : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో 400 మంది రెగ్యులర్ టీచర్స్ ను బదిలీ చేశారు. జిఓ నెంబరు 3 రద్దు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్వు పిటిషన్ దాఖలు చేయాలి. గిరిజన సంఘం దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతం లో మైదానం ప్రాంతం నుండి బదిలీ చేయడం గిరిజన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు, గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన షెడ్యూల్ ఏరియా లో ప్రత్యేక హక్కులను కాల రాసిందన్నారు, ప్రభుత్వము జోక్యం చేసుకుని షెడ్యూల్ ఏరియా లో జీఓ నంబర్ 3 ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు బదిలీ ప్రక్రియ కొనసాగించాలని,జీఓ 3 సుప్రీం కోర్టులో కేసు ఉండగా మైదన ప్రాంతం నుండి సుమారు నాలుగు వందలు మంది గిరిజనేతర ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చెయ్యడానికి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లోత రాంబాబు, కిల్లో సురేంద్ర తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు,
తక్షణమే జీఓ 3అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని వారు అన్నారు.