contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

GITAM: చట్టాలపై అవగాహన తప్పనిసరి : డాక్టర్ రాజు నారాయణస్వామి

  • గీతం విద్యార్థులకు కేళర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రాజు నారాయణస్వామి సూచన

 

హైదరాబాద్ : సైబర్ సెక్యూరిటీని పాఠ్యాంశంగా అభ్యసించే విద్యార్థులందరికీ ఐటీ చట్టం 2000పై అవగాహన తప్పనిసరి అని కీరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, కేరళ అవినీతి వ్యతిరేక క్రూసే డర్ గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ రాజు నారాయణ స్వామి, ఐఏఎస్ అన్నారు. ‘కృత్రిము మేథ యుగంలో సైబర్ సెక్యూరిటీ’ అనే అంశంపై శుక్రవారం ఆయన బీ.టెక్ సైబర్ సెక్యూరిటీ విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారంతా ఐటీ చట్టం – 2000తో అనుసంధానం కలిగిన న్యాయ చట్టాలను అధ్యయనం చేయడంతో పాటు సైబర్ భద్రతకు సంబంధించి, ఆ చట్టంలో పొందుపరిచిన చట్టపరమైన నిబంధనలను అర్ధం చేసుకోవాలని సూచించారు. సైబర్ భద్రతకు క్వాంటం కంప్యూటింగ్ వల్ల కలిగే ముఖ్యమైన ముప్పు గురించి ఆయన వివరించారు. సైబర్ కిల్ చైన్ , ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ అప్రోచ్, ఆర్టిఫిషియల్-డీప్ న్యూరల్ నెట్ వర్క్ ల యొక్క చిక్కులు వంటి కీలక అంశాలను చర్పించారు.

క్లౌడ్ఫీకేషన్ సమస్యలు, మానవులు- యంత్రాల మధ్య పోటీతో సహా సైబర్ సెక్యూరిటీ రంగంలో మనదేశం ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సవాళ్లను కూడా డాక్టర్ స్వామి ప్రస్తావించారు.పాలనలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానంగా, ‘అవినీతిని తగ్గించడానికి వ్యవస్థను మెరుగుపరచడమే ఉత్తము మార్గం’ అని డాక్టర్ స్వామి పేర్కొన్నారు. పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలకమైన నేరుగా లబ్దిదార్ల అకౌంట్లలో జమ (డీబీటీ), ఈ-పాలన, ఎం-పాలన వంటి ఉత్తమ విధానాల వల్ల ఆయా ధ్రువీకరణ పత్రాలను నేరుగా ఆన్ లైన్ లో నిర్ధారిత గడువులోగా అందుకోగలుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఉటంకించారు.

అంతకు మునుపు, డాక్టర్ స్వామి తన వినూత్నమైన, చురుకైన పాలనా విధానానికి పేర్గాంచిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో, గీతం తొలి ఏడాది బీ.టెక్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.తొలుత, ప్రొఫెసర్ టి.త్రినాథరావు అతిథిని పరిచయం చేయడంతో కార్యక్రమం ప్రారంభం కాగా, సీఎస్ఈ. విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా వందన సమర్పణతో ముగిసింది. పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమాలలో పాల్గొని, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :