contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దేశంలోనే చారిత్రాత్మకం రైతు రుణమాఫీ .. సియం రేవంత్ కి పాలాభిషేకం

  • ఒకే విడతలో 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ
  • ఆరు గ్యారంటీల అమలే ప్రథమ ప్రాధాన్యత
  • రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  • జిన్నారం మండలం సోలక్ పల్లి గ్రామంలో రైతు రుణమాఫీ సంబరాలు
  • సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

 

సంగారెడ్డి  జిన్నారం : దేశం లోనే మొట్టమొదటిసారిగా రైతుల సంక్షేమం కోసం ఒకే విడతలో 31 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రైతు రుణమాఫీ ప్రక్రియలో మొదటి విడతలో లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేసిన శుభసందర్భంగా గురువారం సాయంత్రం జిన్నారం మండలం సొలక్ పల్లి గ్రామ పరిధిలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన సంబరాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం రుణమాఫీ పొందిన రైతులకు మిఠాయిలు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీకి అనుగుణంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 31 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం జరిగిందని తెలిపారు. ఆగస్టు నెలాఖరులోపు రెండు లక్షల రూపాయల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ అంశాన్ని గడపగడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. మొదట విడతలో పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు క్లస్టర్ల పరిధిలోని 2843 రైతులకు లక్ష రూపాయల రూపు రుణాలు మాఫీ చేయడం జరిగిందని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియ అనంతరం తిరిగి రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి రైతు ఇంట సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం మధు, గాలి అనిల్ కుమార్, ప్రభాకర్, రవీందర్ గౌడ్, విజయ్ కుమార్, వడ్డే కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, వ్యవసాయ శాఖ అధికారులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :