- ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసిన జీపీ కార్మికులు.
కరీంనగర్ జిల్లా: వీణవంక మండల అభివృద్ది అధికారి మండల అధికారికి గ్రామపంచాయతీ కార్మికులు మంగళవారం వినతి పత్రం అందజేశారు, మండల గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు కండేసదయ
మాట్లాడుతూ గ్రామపంచాయతీలో కార్మికులకు అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నారని ఆ వేతనాలు కూడా సరైన టైంలో ఇవ్వటం లేదని కనీసం భార్య పిల్లలను పోషించుకునే స్థితిలో లేమని కొంతమంది పని భారం ఎక్కువ చేస్తున్నారని రాబోయే వేసవికాలం దృష్టిలో పెట్టుకొని తమకు సమయమును కుదించాలని వారి కోరారు, గతంలో కూడా సమయానికి డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడ్డామని సర్పంచ్లను అడిగితే కార్యదర్శి ని అడుగుమని కార్యదర్శిని అడుగుతే సర్పంచిని అడుగుమని నాన్న ఇబ్బందులు గురి చేశారని ఇప్పుడు అధికారుల పాలన నడుస్తున్న వేళ కూడా అదే పరిస్థితి నెలకొంది. కార్యదర్శిని జీతం డబ్బులు అడగగా స్పెషల్ ఆఫీసర్ ను అడగమని అంటున్నారు. వారిని అడిగితే ఎంపీఓ గారిని అడుగుమని అంటారు, పంచాయతీ కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తక్షణమే తమకు వచ్చే జీతాలను వెంటనే ఇవ్వాలని లేనిపక్షంలో రాబోయే రోజుల్లో సమ్మెకు దిగే పరిస్థితి నెలకొంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కదం కిషన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు దాసరపు వెంకటేష్, మండల కో కన్వీనర్, మహంకాళి కొమురయ్య, దాసరపు శంకర్, దాసరపు మల్లయ్య,దాసరపు కొమురయ్య, లక్ష్మి నిజాముద్దీన్, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.