పల్నాడు జిల్లా /గుంటూరు: రాజధాని అభివృద్ధిలో భాగంగా పల్నాడు జిల్లాలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం శుభపరిణామంఅని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు అదృష్టంగా భావిస్తున్నామని, ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న పెదకూరపాడు, అమరావతి మండలాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుతో నియోజకవర్గానికి మౌలిక వసతులు సమకూరుతాయని తెలిపారు . లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుతో ఇతర రంగాల పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందని, నూతన పరిశ్రమల స్థాపనతో నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పారిశ్రామికంగా తీర్చి దిద్ధేలా కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు.