గుంటూరుజిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతముగా జరుపుకొనుటకు గాను కొన్ని మార్గదర్శకాలను సూచించారు. ప్రజలందరూ ఈ మార్గదర్శకాలను పాటించి నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతముగా, తోటి వారికి ఇబ్బంది లేకుండా, చట్టబద్దంగా జరుపు కోవాలని సూచన.
31-12-2023 రాత్రి నూతన సంవత్సర వేడుకలను బహిరంగంగా జరుపు కొనుటకు అనుమతులు లేవు.
వ్యాపార సంస్థలు నూతన సంవత్సర వేడుకలను వారి వారి కార్యాలయం లోపల మాత్రమే జరుపుకోవాలి.
బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు మరియు మోటార్ సైకిళ్ల పైన మద్యము సేవించి, ముగ్గురు ముగ్గురు తిరగటం, ఓవర్ స్పీడ్‌లో నడపడం, ప్రమాదకరమైన స్నేక్ డ్రైవింగ్, సైడ్ స్టాండ్ డ్రైవింగ్, మోటారు సైకిళ్ల సైలెన్సర్‌లను తొలగించి, శబ్ద కాలుష్యము చేయుట వంటి చర్యలు చేసే వారిపైన డ్రంకన్ డ్రైవ్ మరియు మోటారు వాహనాల చట్టము ప్రకారం చర్యలు తీసుకోనా బడును.
నూతన సంవత్సర ఈవెంట్‌లు/కార్యక్రమాలు నిర్వహించు హోటల్‌లు, క్లబ్‌ల నిర్వాహకులు సంబంధిత పోలీస్ అధికారుల నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతించిన సమయానికి మించి కార్యక్రమాలు నిర్వహించరాదు.
అనుమతి లేకుండా, నిబంధనలను అతిక్రమించి నిర్వహించే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోనబడును.
నూతన సంవత్సర వేడుకలలో బహిరంగ ప్రదేశాలలో బాణసంచా కాల్చి ప్రజల భద్రత కు భంగం కల్గించే వారిపైన చట్టరీత్య చర్యలు తీసుకోనబడును.
నూతన సంవత్సర వేడుకల కొరకు యువకులు, బాలురు ఇంటి నుండి రాత్రి బయటకు వచ్చి మోటారు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉన్నందున, తల్లితండ్రులు తమ పిల్లలు 31వ తేదీ రాత్రి ఇంటి నుండి వంటరిగా బయటకు రాకుండా జాగ్రత్త వహించాలి.
డిసెంబరు 31 రాత్రి గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్‌లు, పికెట్‌లను ఏర్పాట్లు చేసీ రాత్రి 10 గంటల నుండి వాహనాలను తనిఖీ చేయడం, స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణములో నూతన సంవత్సర వేడుకలు ప్రజలందరూ జరుపుకోవాలి అనే ఉద్దేశ్యంతో పోలీసు డిపార్ట్మెంట్ విధించిన పై నిబంధనలు అందరూ పాటించాలని జిల్లా యస్.పి శ్రీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు