జగిత్యాల పట్టణంలో శుక్రవారం స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో స్వర్ణకార నాయకులు మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో కొన్ని జ్యువెలరీ షాప్ యజమానులు స్వర్ణకారులను మరియు ప్రజలను మోసం చేస్తూ నాణ్యతలేని బిస్కెట్ బంగారం అమ్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్వర్ణకార నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కొందరు జువెలరీ షాప్ యజమానులు స్వర్ణకారులను ప్రజలను మోసం చేస్తూ నాణ్యతలేని బిస్కెట్ బంగారం అమ్ముతున్నారని జగిత్యాల పట్టణ స్వర్ణకారులకు సాక్షాధారాలు లభించడంతో నాణ్యతలేని బిస్కెట్ బంగారం అమ్ముతున్నారని విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి జ్యువెలరీ షాప్ లపై సోదాలు నిర్వహించి స్వర్ణకారులకు ప్రజలకు తగిన న్యాయం చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం నాయకులు మరియు అధిక సంఖ్యలో స్వర్ణకారులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.